చెవిటివాడు--డి.కె.చదువులబాబు--9440703716

గోపాలం,రవీంద్ర,రాజారావు కుమారులు. రవీంద్ర చెవిటివాడు. ఇద్దరూ పదవతరగతి చదువుతున్నారు.గోపాలం తమ్ముడిని చెవిటివాడంటూ హేళన చేసి ఆటపట్టించే వాడు.హేళన చేయవద్దని తండ్రి చెప్పినా వినేవాడు కాదు. వాడిని చూసి కొందరు మిత్రులు కూడా ఆటపట్టించేవారు.
రవీంద్ర హేళన చేసేవారిని పట్టించుకునే వాడు కాదు. ఉపాధ్యాయులకు దగ్గరగా మొదటి బల్లపై కూర్చునేవాడు. వినేయంత్రంవల్ల శ్రద్దగా వినేవాడు. బాగా నేర్చుకునేవాడు. ఎప్పటిపని అప్పుడే పూర్తిచేసేవాడు.
గోపాలం శ్రద్దగా వినకపోవడం, చదవకపోవడం,అల్లరిపిల్లలతో కలిసి తిరగటం రాజారావు గమనించాడు. శ్రద్దగా చదువుకోమని, అల్లరి తిరుగుళ్ళు మానమని దండించాడు. ఆ మాటలు వాడిచెవికెక్కలేదు.
పరీక్షలుదగ్గరకొచ్చాయి.విద్యార్థుల్లో అలజడి మొదలయింది. అంతవరకూ చదవని వాళ్ళు అప్పటికప్పుడు పుస్తకాలుపట్టారు.
ఉపాధ్యాయులు చెప్పేటప్పుడు వినకపోవటంవల్ల, పాఠ్యాంశాలు అర్థంకావడంలేదు.
రవీంద్ర ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. గోపాలం పరీక్షతప్పాడు. వాడితో తిరిగిన వాళ్ళూ ఫెయిలయ్యారు.
"మేము చెప్పింది శ్రద్దగావినటం వల్లనే రవీంద్ర ప్రథముడిగా రాగలిగాడు. మంచి మాటలు,పాఠాలు వినని మీరు చెవిటోళ్ళు"అన్నారు ఉపాధ్యాయులు.
రాజారావు గోపాలంతో "చెవిటోడంటూ తమ్మున్ని హేళనచేసేవాడివి. ఈ రోజు వాడు నా పేరు నిలబెట్టాడు. నేను ఎంతజెప్పినా నీవు వినలేదు. పెద్దలమాటలు వినని నీలాంటి వాళ్ళు నిజమైన చెవిటోళ్ళు"అన్నాడు.
'గురువులమాట, తల్లిదండ్రులమాట విననివాడే నిజంగా చెవిటోడు. ఈ చెవిటితనం చాలా ప్రమాదకరం.' అని గుర్తించిన గోపాలం తన ప్రవర్తనమానుకున్నాడు.
డి.కె.చదువుల బాబు.3/528.వై.యం.ఆర్.
కాలనీ.ప్రొద్దుటూరు.కడపజిల్లా..9440703716