ఆటవెలది..పూలబాట--...జాధవ్ పుండలిక్ రావు పాటిల్--9441333315

కుర్చి మీద కుక్క కూర్చుండ పెట్టిన
దాని గుణము మార్చ తరము కాదు
అల్పబుద్ధి కేల అందాల పీఠము
పుండలీకుమాట పూలబాట


కన్నులున్న చోట కనురెప్ప లుండును
ధర్మమున్న చోట దయయె యుండు
ముర్ఖులున్న చోట మూర్ఖత్వముండును
పుండలీకుమాట పూలబాట


..