:భాషా భావనలు: రావిపల్లి వాసుదేవరావు--పార్వతీపురం ఫోన్ నెంబర్ :9441713136.

మాట ఒక్కటి చాలు
మంత్రమై నిలుచునూ
ప్రగతి దారుల వెంట
పయనింప చేయంగ


పాట ఒక్కటి చాలు
పాఠమై నిలుచునూ
ఎదుగుతూ ఒదుగుతూ
విజయాన్ని పొందంగా


గేయమొక్కటి చాలు
గాయాన్ని మాపునూ
సమాజ రీతులూ
మార్చివేయంగా


పద్యమొక్కటి చాలు
మనసులో నిలుచునూ
సరికొత్త నీతులను
మనకు నేర్పంగా


శ్లోకమొక్కటి చాలు
శోకమును బాపునూ
మది శాంతితో పాటు
సంతసం పెంచంగ


సామెతోక్కటి చాలు
సారమును తెలుపునూ
సందర్భ భావాన్ని
విడమరచి చెప్పంగ