దసరా(బాలగేయం )--రావిపల్లి వాసుదేవరావు-పార్వతీపురం 9441713136.

వచ్చింది వచ్చింది దసరా
తెచ్చింది తెచ్చింది సరదా


శరదృతువు ఆశ్వయుజంలో
వచ్చునుకద ఈ పండుగ దసరా


పిల్లలు పెద్దలు తేడా లేక
భక్తి తో కొలిచే పండుగ దసరా


మహిషాసురునూ చంపిన దుర్గకు
మొక్కులు మొక్కే పండుగ దసరా .


చదువు లో విజయం ఇవ్వమని
పిల్లలు చేసే పూజే దసరా


బొమ్మలకొలువులు అందంగా
అలంకరించే వేడుక దసరా


జమ్మిచెట్టుకు ఆయుధాలకు
పూజలు చేసే పండుగ దసరా


అంబ తొమ్మిది అవతారాలలో
కొలువైనట్టి పండుగ దసరా


చెడుపై మంచి విజయం పొందగా
పవిత్రమైన పండుగ దసరా


 :