మా బాబు-రావిపల్లి వాసుదేవరావు-పార్వతీపురం-9441713136

చక్కదనాల మా బాబు
చెంగు చెంగున గెంతాడు
నవ్వుతు తుళ్ళుతూ వాడు
విన్యాసాలే చేసాడు


కాళ్ళు చేతులు ఆడించి
కిల కిల మనీ నవ్వాడు
చలాకి పనులూ చేస్తూ
చక్కని పాటలు పాడాడు


మామ చెప్పిన మాటలను
తూచ తప్పక చెప్పాడు
చిలక పలుకులు పలుకుతూ
చిరునవ్వులనే రువ్వాడు


కుప్పిగెంతులు వేస్తూనే
చక చక మనీ కదిలాడు
అమ్మకు నాన్నకు వాడూ
సంతోషాన్ని పంచాడు


: