చదువుగురించి
మాట్లాడుకొవాలి ,
చదువు ..
ఏభాషలో సాగిందీ ,
చెప్పుకోవాలి.
చదువు ఎక్కడ
కొనసాగిందీ ...
చర్చించుకోవాలి !
దిగువ మద్యతరగతి
నేపథ్యంగా ...
ప్రభుత్వ విద్యాసంస్థలే
నాప్రగతికి
అండగా నిలిచాయి ,
నన్నొక బాధ్యతగల ,
దంత వైద్యుడిని చేసాయి ,
సామజిక సమస్యలకు
స్పందించే ---
కవిని చేసాయి ...
కథకుడిని చేసాయి ..
వ్యాసకర్తను చేసాయి ..
ఒక సాహిత్య కారుడిగా
తయారు చేసాయి ...!
చెప్పొచ్చేదేమిటంటే ,
వృత్తి విద్య తప్ప
మిగతా చదువంతా
మాతృభాషా --
మాధ్యమంలోనే ...!
నాకొక గొప్ప జీవితాన్ని
అందించింది ....
తెలుఁగు భాషే ...
తెలుగుతల్లికి వందనం ..!!