మన సినీ నటుల నట జీవితంలో వింతలు.:--డా.బెల్లంకొండనాగేశ్వరరావు.9884429899.

వేదికనుండి-వెండితెరకు.
డాక్టర్ ని అవుదామని యాక్టర్ అయ్యాము అని మన సినిమా నటులు చెప్పడం మనకు తెలిసిందే!
*ప్రముఖ నటి సూర్యాకాంతం కథానాయకి కావాలని చిత్రపరిశ్రమకు వచ్చారు.తొలుత జెమిని సంస్ధలో 75 రూపాయలకు జూనియర్ ఆర్టిష్టుగాచేరి 'నారదనారది'(1946) చిత్రంలో గుంపులో గోవిందయ్యలా కనిపిస్తుంది.(ఈ చిత్రంద్వారా సుసర్ణ దక్షణామూర్తి సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు)ప్రమాదంలో గాయపడటంతొ మంచంపై చాలారోజులు ఉండవలసి రావడంతో ఆమె కు తల్లి,గయ్యాళి పాత్రలే చివరివరకు దక్కాయి.
*గాయూని జిక్కి 'వాల్మీకి'(1945) వంటి కొన్ని చిత్రాలలో బాలనటిగా నటించినా గాయనిగా స్ధిరపడ్డారు.
*నటి సరిదె వరలక్ష్మిబాలనటిగా 'బాలయోగిని'(1937) తో సినీజీవితంప్రారంభించి  కథానాయకిగా మారి,అనంతరం విభిన్నపాత్రలు పోషించారు.
*దాసరిగిరిజ 'పరమానందయ్య శిష్యులు'(1950)అక్కినేని సరసన,'మనోహర'(1954) చిత్రంలో కథానాయకిగా నటించినా, క్రమేపి హాస్యనటిగా స్ధిరపడిపోయారు.
*జూనియర్ కళాకారిణి 'సురభిబాలసరస్వతి' 'రూపవతి'(1951) చిత్రంలో కథానాయకిగా నటించినా చివరివరకు హస్యనటిగానే కొనసాగారు.
*చిత్రకళ-రూపావాణి వంటి  సిని పత్రికలకు వార్తలు రాస్తుండే పేకేటిశివరామ్ తొలిసారి 'శాంతి'(1951)ఈచిత్రంలో సావిత్రితో యుగళగీతంలో నటించారు.అలా హస్యనటుడిగా మారి అనంతరం 'భలేఅబ్బాయిలు'(1961)-కులగౌరవము'(1972) చిత్రాలద్వారా దర్శకుడిగా మారారు.
*నటి ఋష్యేంద్రమణి తొలిసారి 'శ్రీకృష్ణతులాభారం'(1935)చిత్రంలో సత్యభామగా నటించి వేయిరూపాయలపారితోషకం పొందారు.కాలక్రమంలో తల్లి పాత్రలలో ఒదిగిపోయారు.
*'కన్నతల్లి' (1953)చిత్రం(ఈచిత్రం ద్వారా గాయని పి.సుశీల పరి చయం అయ్యారు)లో నర్తకిగా ప్రవేసించిన రాజసులోచన అనంతరం కథానాయకిగామారారు.అనంతరం పలువిభిన్నపాత్రలు చెసారు.
*గుమ్మడి'జై బేతాళ' (ఈచిత్రం అసంపూర్ణంగా ఆగిపోయింది)చిత్రంలో జమున సరసన కథానాయకుడిగా పరిచయం జరిగినప్పటికి అనంతరం విభిన్న పాత్రలకే పరిమితం అయ్యారు.
*సామర్ల వెంకట రంగారావుగారు 'వరూథిని'(1946)చిత్రంలో దాసరితిలకం(గిరిజతల్లి)గారి సరసన కథానాయకుడుగా పరిచయం అయినప్పటికి చివరకు విభిన్నపాత్రలు చేసారు.
*చిలకలపూడి రామాంజనేయులు(సి.యస్.ఆర్)తొలుత శ్రీకృష్ణుడిగా 'ద్రౌపతివస్త్రాపహరణం'(1936)లోనటించినా చివరకు విభిన్నపాత్రాలు చేసారు.
*పసుపులేటి కన్నాంబ కథానాయకిగా'హరిశ్చంద్ర'(1935)చిత్రంతో నటించినప్పటికి చివరకు విభిన్నపాత్రలలో నటించారు.
ముక్కామలా కృష్ణమూర్తి సహాయనటుడిగా *'మాయమశ్చింద్ర'(1945)చిత్రంద్వార పరిచయమై కథానాయకుడిగా,నిర్మాతగా,దర్శకుడిగా మారి,చివరకు విభిన్నపాత్రలు చేసారు.
*రేలంగి వెంకట్రామయ్య 'శ్రీకృష్ణతులాభారం'(1935)చిత్రంద్వారా పరిచయమై,విభిన్న పాత్రలు చేస్తూ,'పక్కింటిఅమ్మయి'(1953)చిత్రంలో అంజలి సరసన కథానాయకుడిగా నటించి విభిన్నపాత్రలకు పరిచమైయ్యారు.
*టి.జి.కమలాదేవి.(తోటాగోవిందమ్మ)తొలుత 'చూడామణి'(1941)చిత్రంలో సి.యస్.ఆర్.చెల్లెలుగా నటించారు.'ముగ్గురురుమరాఠిలు'(1946)చిత్రంలో కథానాయకిగా నటించినప్పటికి అనంతరకాలం విభిన్నపాత్రలు చేసారు.
*గరికపాటివరలక్ష్మి తొలుత 'బారిష్టరు పార్వతీశం'(1940)చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయినప్పటికి కాలక్రమంలో విభిన్న పాత్రలు చేసారు.
*హాస్యనటుడు పద్మనాభం తొలుత'మాయలోకం'(1945) చిన్నపాత్ర లలో పరిచయమై,పలుచిత్రాలలో కథానాయకుడిగా నటించినప్పటికి,నిర్మాతగా, హాస్యనటుడిగా స్ధిరపడ్డారు.
*కస్తూరిశివరావు తొలుత 'వరవిక్రయం'(1939)చిత్రం ద్వారా హాస్య నటుడిగా ప్రవేసించి,గాయకుడిగా,నిర్మాతగా 'చిన్నమ్మకథ'(1952) చిత్రంలో కృష్ణకుమారి తో ,'గుణసుందరికథ'లో జూ"శ్రీరంజనితో  నటించినప్పటికి హాస్య నటుడిగా స్ధిరపడ్డారు.
*నటి ఛాయాదేవి తొలుత స్టేజి డాన్స్ ర్ గా ఉండి 'సాయిబాబా'(1950)చిత్రంలో రంగప్రవేశం చేసి విభిన్న పాత్రలు పోషించారు.
*నటి పండరీబాయి కధానాయకిగా వచ్చి అనంతరం విభిన్నపాత్రలు పోషించారు.
*కైకల సత్యనారాయణ'సిపాయికూతురు'(1959) కథానాయకుడిగా వచ్చి
నవరస నటుడుగా మారారు.
*కొంగర జగ్గయ్య తొలుత'ప్రియురాలు'(1952) చిత్రంద్వారా లక్ష్మికాంత సరసన కథానాయకుడుగా వచ్చి,విభిన్నపాత్రలు చేసారు.
*రిపబ్లిక్ బ్యానర్ చోడవరపు సీతారాం నిర్మత,దర్శకుడిగా ఉంటూ జమున సరసన కథానాయకుడిగా 'బొబ్బిలియుథ్థం'(1963) చిత్రంలో నటించారు.
*(కొమ్మినేని అప్పారావు) చక్రవర్తి.డబ్బింగ్ కళాకారుడిగా,నటుడిగా వచ్చి సంగీతదర్శకుడిగా స్ధిరపడ్డారు.
*నటి జయచిత్ర తల్లి అమ్మాజి నందమూరివారి సరసన కథానాయకిగా నటించినా,అనంతరం చిన్నపాత్రలలో సర్దుకు పోయారు.
*'పాతాళభైరవి' (1951)చిత్రం కథానాయకి మాలతి చివరిరోజుల్లో తల్లిపాత్రలతో జీవించారు.
వందలమంది కళాకారులు బండ్లుఓడలుగా-ఓడలు బండ్లుగా మారి జీవించారు.