మంచి పనులు --కళావతి కందగట్ల--హైదరాబాద్ 9948263004

మనం చేయలేని పనులు 
ఇతరులుచేస్తుంటే 
భరించలేని తనం
మనకు సహాయం చేసే 
అవకాశం ఉన్నా
తప్పుకునే మనస్థత్వం....


మంచితనం చేతగానితనం 
అవుతున్న రోజులు
మంచివాళ్ళను పిచ్చివాళ్ళుగ
చూస్తున్న జనాలు
మంచిపనులు చేస్తుంటే 
తప్పులు వెతుకుతున్న 
సాటి మనుషులు....


ఒక మనిషి 
నాలుగు మంచిపనులు
చేయాలంటే.......
ఇతరుల పట్ల 
ప్రేమ ,దయ ఉండాలి....


సహాయం చేసే 
మంచి మనసు ఉండాలి
మనిషి ఇన్ని సుగుణాలు కలిగి ఉండడం
అంత సుళువు కాదు....


అది ఒక్క రోజులో వచ్చేవి కావు
మంచి పనులు  చేసేవారిని
హేళన చేయకండి  
కించపరచకండి.... 
వీలయితే ...ప్రోత్సహించండి