ఉషోదయాన మేల్కొనుట
తప్పింది...
పరుగులు తీస్తూ బడికి
ఉరికే అవస్థా తప్పింది..
బండెడు పుస్తకాల
మోత లేదు...
నిద్ర కళ్ళతో బస్సుల్లో
ప్రయాణాలు లేవు..
మాయదారి కరోనా
కాలు బయట పెట్టలేము
ఆన్లైన్లో పాఠాలు...
నట్టింట్ల నెట్టుతో సాగించాలి
ఇక చదువు ప్రయాణం
కళ్లప్పగించి చూడాలి తెరను
పిల్లల అదుపు చేయలేక
తల్లి దండ్రుల ఆపసోపాలు
అందరినీ సమన్వయ పరచలేక
టీచర్ల కు తలనొప్పులు
కాల గమనం మార్పుల మయం
మార్పు లేనిది సాధించలేము
ప్రగతి..
నడుస్తున్నది కంప్యూటర్ యుగం
మితిమీరని వాడకం...
ఆరోగ్య దాయకం