పల్లవి //
పిల్లలము మేం పిల్లలము
చదువుకునే పిల్లలము
1...చ
బడికి సెలవులు వచ్చినవి
అమ్మమ్మ ఊరికి వెళ్లితిమి
మామయ్య పిల్లల చేరితిమి
బంధువుల నెందరినో కలిసితిమి
2.చ
ఆరు బయటకు పోయితిమి
ఆటపాటల గడిపితిమి
చెరువు చెంతకు చేరితిమి
చేపలు పీతలు చూచితిమి
3.చ
ఈత కొట్టుచూ ఎగిరితిమి
ఈలలు కేరింతలు కొట్టితిమి
చెట్టూ చేమా తిరిగితిమి
ప్రకృతి వింతలు చూచితిమి
ఫల పుష్పములు తెంపితిమి
4.చ
వెన్నెల రాత్రులు గడిపితిమి
అమ్మమ్మ పక్కన చేరితిమి
కథలు వింతలు చెప్పితిమి
సెలవులు హాయిగా గడిపితిమి
తిరిగి ఊర్లకు చేరితిమి