సహాయము: - డాక్టర్. బి. వి. ఎన్ . స్వామి

తనకు తెలిసిన నలుగురు జులాయి యువకుల్ని పిలిచిండు బుంగి. దొంగతనం చేయకుండా, తల్లిదండ్రుల పేరు వాడకుండా ఒక రోజులో ఎంత సంపాదించగలరో చెప్పండని అడిగిండు. ఎవరూ నోరు తెరువలేదు. ఒక రోజులో ఎవరి సహాయం లేకుండా సంపాదించిన డబ్బును, నిజాయితీగా నా ముందుంచాలి. అపడు మీకు శ్రమ విలువ ఏమిటో తెలుస్తుంది అన్నాడు. నలుగురు సరేనని, నాలుగు దిక్కుల వెళ్ళారు.
సాయంత్రం అయింది. వచ్చిన యువకులను కూర్చోబెట్టిండు బుంగి. తమ అనుభవాలను చెపుతూ సంపాదించింది ఇవ్వమన్నాడు. ఒక్కొక్కరు ఇలా చెప్పసాగారు.
ఉదయమే లేచి, పంచెకట్టి, నామాలు పెట్టి చిలక పంచాంగాన్ని పట్టుకొని కొద్దిసేపు గుడి ముందు కూర్చున్న. పగలంతా ఇండ్ల మధ్య తిరిగి సాయంత్రం వరకు మూడు వందల రూపాయలు సంపాదించిన.
నేను చిరిగిన బట్టలు వేసుకొని, వరదల్లో సర్వం కోల్పోయిన వాడిలా తిరిగిన నాకు సానుభూతి లభించింది. రెండు వందలు దొరికినయి.
జుఈఐ పట్ల అవగాహన కలిగించడానికి ఐశిజీలిలిశి ఆజిబిగి వేసిన. చాలా మంది గుమికూడారు. వారి సంక్షేమం కోసం చందాలు అడిగిన. యాభై రూపాయలు దొరికినయి.
నేను గూర్ఖా డ్రెస్ వేసుకొని ఇల్లిల్లూ తిరిగిన. చాలా మాటలు పడిన.
‘‘అర్థరాత్రి దాక తాగుకుంటూ కూర్చుంట. ఎన్నడూ కనిపించలేదు’’ ఒక తాగుబోతు అన్నడు.
‘‘రాత్రి రెండు గంటల ప్రాంతాన తిరుగుత’’ అన్నాను.
‘‘ఒక్కరోజు కూడా నీ చపడు మాకు వినబడలేదు’’ అన్నారు కొంతమంది
అనుమానాలు, విసుగుల మధ్య సాయంత్రం వరకు నలభై రూపాయలు జమ చేసిన. 
తెచ్చిన డబ్బును బుంగి ముందుంచారు.
‘‘మీరు కష్టపడితే సమాజం మీకు సహాయపడుతది’’ అన్నాడు బుంగి
తన సత్కర్మాచరణం
బున భాగ్యము వేగవృద్ది బొందు జగత్ప్రా
ణుని వర సాహాయ్యముచే
నవలం బెంతైన బెరుగునయ్య కుమారా!
కుమార శతకం
పక్కి లక్ష్మీ నరసింహకవి