గమనం...--చీకట్ల సంగీత.--జగిత్యాల.

విత్తనమా...
నీవు మహా అద్భుతం,
ఎందుకో తెలుసా..!


పెను గాలిని,
తట్టుకుంటావు..!


మొలకెత్తిన నాటి నుండి
నీ కొచ్చే కష్టాలను,
అడ్డుకుని ఎదుగుతావు..!


వర్షానికి విరిగిపోకుండా,
బలాన్ని నీలో-
నింపుకుంటావు..!


మహావృక్షమై,
ఫలాలిచ్చి --
ఆకలి తీరుస్తావు..!


నీడనిచ్చి సేద తీరుస్తావు..
ఎండకు విసిగిపోయిన
వారికి చల్లని గాలినిస్తావు..!


పక్షులకు అవసాన్నిస్తావు..
ఎండిపోయిన కూడా మనిషి
చితికి పనికొస్తావు..!


పచ్చని ప్రకృతిలో అందాన్ని
పంచుతావు..
సృష్టిలో దేవుడిచ్చిన
అద్భుతము నీవే
విత్తనమా..!!