టాగూర్ తాతయ్య--ప్రమోద్ ఆవంచ

అప్పుడు పిల్లలు విశాల ప్రకృతిలో ఉత్సాహంగా తమ పూర్తి శక్తిని వినియోగించి తెలుసుకోదగిన విషయాలన్నింటిని నేర్చుకోవడానికి స్వంతంగా ప్రయత్నం చేస్తారు.శాంతి నికేతన్ లో తరగతులు చాలా పెద్దవి కాకుండా చిన్న చిన్న జట్లుగా విద్యార్థులను విభజించి చెట్ల నీడలో కూర్చోబెట్టి పాఠాలు చెప్పేవారు.అక్కడ పిల్లలకు ఎటువంటి నిర్బంధాలు  కాని, ఖచ్చితమైన తరగతి గది, క్రమశిక్షణ కానీ కనిపించేది కాదు.
          పాఠశాలలో స్వయం పరిపాలనా వ్యవస్థ గురించి పిల్లలకు చెప్పేవారు.తాతయ్య ఇంగ్లాండ్,అమేరికా వంటి దేశాలు పర్యటించి అక్కడి విద్యా విదానాలలో వున్న మంచి పద్దతులను మనదేశంలో కొనసాగుతున్న పద్దతులతో జోడించి, పిల్లలకు ఉపయోగపడేలా పాఠశాలలో నేర్పిస్తూవుండేవారు.
                    మనుషులందరి మంచికి అవసరమయ్యే పద్దతులు పాటించేందుకు ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటేనే తమకు తాము స్వతంత్రులవుతారనే సూత్రాన్ని తాతయ్య నమ్మేవాడు.అదే పిల్లలకు నేర్పించేవాడు.పిల్లలు తమ లీడర్ ను వాళ్ళే ఎన్నుకొని,ఆ లీడర్ సూచనల మేరకు ఆశ్రమంలో పనులన్నీ వాళ్ళే చేసుకునేవారు.--మిగితాది రేపు....