ఆకాశంలో--- డా.గౌరవరాజు సతీష్ కుమార్

వెలుగులు పంచుచు సూర్యుడు వచ్చె
వెన్నెల పంచుచు చంద్రుడు వచ్చె
వానలు పంచుచు మేఘుడు వచ్చె
రంగులు పంచుచు సింగిడి వచ్చె
దారిని చూపుచు చుక్కలు వచ్చె
ఆకాశంలో వీళ్ళంతా
ఎలా వచ్చిరో చెప్పండర్రా?!