బతుకమ్మ---సాకి,కరీంనగర్.

ముత్తైదువల ముచ్చటైన పండుగ
ముగ్గురమ్మల కొలుచు బతుకమ్మ పండుగ
అతివలు ఆడు అందమైన పండుగ
అన్ని రంగుల పూలు కలిసిన బతుకమ్మ పండుగ
ఆడపడుచుల ఆరాధ్యమైన పండుగ
ఆటపాటల ఆనందాల బతుకమ్మ పండుగ
కళలను ప్రదర్శించే కమ్మని పండుగ
కష్ట సుఖాల కలబోత  బతుకమ్మ పండుగ
తెలంగాణ తెగువ మన పండుగ
త్యాగాల చరిత్ర మన బతుకమ్మ పండుగ
ఎములాడ రాజన్న ఎల్లిపోయిననాడు
బృహదమ్మని ఓదార్చిన బతుకమ్మ పండుగ
తెలంగాణ సంస్కృతి కి నిలువుటద్దం ఈ పండుగ
సామాజిక సామరస్యం నింపు బతుకమ్మ పండుగ.