టాగూర్ తాతయ్య-ప్రమోద్ ఆవంచ

మొత్తం మీద చదువు విషయాలలో తాను అనుభవించిన కష్టాలు,తన పిల్లలు పడకూడదని, తను చదువుకునే రోజుల్లో ఏ సదుపాయాలు వుంటే బాగుండేదనుకున్నాడో, వాటినన్నిటినీ ఆశ్రమంలో ఏర్పాటు చేశాడు.
                  మొదటి సంవత్సరం తన కుమారునితో కలుపుకుని అయిదురు విద్యార్థులతో ప్రారంభమైన స్కూల్ కొద్ది సంవత్సరాలకే నూటాయాబై వరకు పెరిగింది.ఆ స్కూల్ లో బాలికలు కూడా చదువుకుంటున్నారు.వాళ్ళ నివాస స్థలాలు వేరు వేరు అయినప్పటికీ చదువుకోవడం మాత్రం కలిసే చేసేవారు.
                    శాంతి నికేతన్ స్కూల్  పూర్వపు తపోవన భూముల పద్దతిలో  ప్రారంభించబడింది.అద్యాపకులు, విద్యార్థులు, సత్యాన్వేషణ చేయడానికి పట్టణ పరిసరాలను వదిలి దూరంగా ప్రకృతి సౌందర్యాలతో కళ కళ లాడే అడవుల్లో నివాసముండేవారు.సత్యం, సంపత్తి కన్నా ఎంతో విలువైనదని తెలుసుకున్నారు.ప్రకృతిని ప్రేమించడం,సమస్త ప్రాణులను గౌరవించడం నేర్చుకున్నారు.విద్యార్థులు తమ అధ్యాపకులతో పాటు సాధారణ జీవితాన్ని గడుపుతూ వుండేవారు.హృదయంలో సత్యాన్ని,బయట సాధారణంగా వుండే తత్వాన్ని తాతయ్య ఎక్కువగా ఇష్టపడేవాడు.అదే ప్రపంచ దేశాలకు భారత దేశం ఇంచే కానుక అని అభిప్రాయపడుతుండేవాడు.మిగితాది రేపు....