గెలుపు,ఓటమిల ద్వంద్వాల బంధనాల తెంచుకొని
స్వేచ్ఛా విహంగమై విజయం సాధించడం
సంసార చట్రంలో నలిగిపోతూ ఈతి బాధలకు భీతిల్లక హాయిగా రచనాభివేశంలో రాజిల్లటమే
రెక్కలువిప్పుకున్న బాల్యం ఆట విడుపుగా ఆదివారం తో సేదతీరడం
అలిసిపోయిన కోయిల ఆకుపచ్చని చెట్టుమీద గూటిలో పిల్లస్వరాల స్వరవిన్యాసం
చైతన్యాన్ని విస్తరించుకుంటూ ఆత్మ సాక్షిగా కర్మనిరతి సాధిస్తూ పొందే బ్రహ్మానందం
గుట్టలు, చెట్లు సెలయేళ్ళు,పంట చేల దృశ్యాల సౌందర్యాత్మక భావోద్వేగం
అహంకారాన్ని వదిలేసి అంతరాత్మతో మమేకమై ప్రతిష్టించే స్వతంత్ర వ్యూహం
విస్తారమైన ప్రేమ స్వేచ్ఛ ను కోరి
సారస్వతను సాధించే ఏకత్వం
కుంచె స్వేచ్చగా నర్తిస్తే ఫికాసోలు,
త్రీడీలూ
కళాపూర్ణోదయం !
ఆపేక్ష కు స్వేచ్చనిస్తే ఆకాశంలోని చందమామను కోసుకొచ్చి వెన్నెల నారేసే వేల్పు గుణం !
ఊహకు ప్రాణం పోస్తే చాలు
అక్షర సీతాకోకలు స్వేచ్ఛగా ఎగురుతాయి