శక్తి సూత్రం ....----చీకట్ల సంగీత.,,జగిత్యాల.

శక్తి....
అంతరంగంలో దాగి ఉన్న
అద్భుత శక్తిగా అవతరించి,
ఓసారి తళుకుమన్న తారలా
ప్రకాశవంతంగా మెరుస్తుంది ,
సృజన..!


సాధనతో నిరంతర-
అలుపెరుగని కృషితో,
ముందుకు వెళ్తూ-
అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ,
ప్రతిభతో విజయానికి-
పట్టాభిషేకం చేస్తుంది !


అక్కడే ఆగిపోకుండా
సృజనలో మెళుకువలు,
దిద్దుకుంటూ,
పట్టుదల దీక్షతో -
మున్ముందుకు సాగితే,
జీవితం-
ద్రాక్షారసములా తియ్యని,
మాధుర్య మే అవు తుంది!