పువ్వులు లేకుంటనే బతుకమ్మలు పేర్చే పోటీ...
బతుకమ్మ అంటెనే పువ్వులు !
మరి పువ్వులు లేకుంటగుడ
బతుకమ్మ పేర్వగలమా..!
పేర్వగలమని నిరూపించారు
మా కళాశాల విద్యార్ధులు.
(మహిళా డిగ్రీ కళాశాల-కరీంనగర్)
తెలంగాణకు బతుకమ్మ
ఒక జీవితావసరం !
అది అనిర్వచనీయమైన
జీవన తాత్త్వికత !
కనుక ఈతరం యువతుల
సాంప్రదాయ సహగమనం,
ఆలోచన,సృజన,నవకల్పన,
వ్యక్తీకరణ నైపుణ్యాన్ని
బతుకమ్మ రూపకంగా--
అనుశీలించుటానికి...
మా విద్యార్థులకు గతఏడాది
పువ్వులు లేకుంట, రంగులు,
రసాయనాలు వాడకుంట,
పైస ఖర్చు లేకుంట,
ప్రకృతి వనరులు ఆధారంగా
బతుకమ్మ పేర్చుమని--
Innovative practice పోటీ పెట్టాను.
ఫలితంగా~~
అద్భుతమూఅనూహ్యమూ
అయిన సృజన వెల్లడైంది.
తీరుతీరు బతుకమ్మలు
కొలువుదీరాయి.
పిల్లలంతా---
ఎంతకష్టపడ్డారో ! అంతే మెచ్చుకోలు !
అంతే ఆనందం
పరస్పరం పంచుకున్నరు !!
మూడువేల మంది విద్యార్థులతో
ముచ్చటతెలిపే మా ప్రాంగణం
వాళ్ళ సృజనాత్మకతపై
ఆశీస్సుల
పూలజల్లు కురిపించింది.
గురువుగా నాసంబురం
బతుకమ్మను తలదాల్చిన
సరిగంగ ప్రవాహమే గదా !!