మాకిష్టం--డా.గౌరవరాజు సతీష్ కుమార్.

ఆటలు ఆడుట మాకిష్టం
పాటలు పాడుట మాకిష్టం
ఊయల ఊగుట మాకిష్టం
వానలొ తిరుగుట మాకిష్టం
అల్లరి చేయుట మాకిష్టం
అమ్మా నాన్నల ఒళ్ళో కూచుని
మారాం చేయుట మరీమరీ ఇష్టం !!