చిత్రాంగదుడు ---సుజాత.పి.వి.ఎల్.

శంతనుడు, సత్యవతిల మొదటి కుమారుడు చిత్రాంగదుడు. విచిత్రవీర్యుడు. భీష్ముడు సత్యవతికి కాక శంతనుడు, గంగలకు కలిగిన కుమారుడు. భీష్ముడు తన శపథం మేరకు చిత్రాంగదుని హస్తినాపుర సింహాసనానికి పట్టాభిషిక్తుని చేసాడు. చిత్రాంగదుడు బలవంతుడనని అహంకారము కలవాడు. అదే పేరు కలిగిన ఒక గంధర్వ రాజు చిత్రాంగదుని యుద్ధానికి పిలిచాడు. ఆ యుద్ధంలో గంధర్వ రాజు చిత్రాంగదుని చంపాడు. చిత్రాంగదుని మరణం తరువాత భీష్ముడు విచిత్రవీర్యుని పట్టాభిషిక్తుని చేసాడు.