టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ

దారి వెంట వచ్చిపోయే వాళ్ళను చూస్తూ కాలం గడిపేవాడు.అప్పుడు అక్కడికి ఒక అనాధ బాలిక వసంతి వస్తుంది.ఆసన్యాసి దగ్గరే కూర్చుంటుంది.కొంతసేపటికి, అట్లాగే పడుకొని నిద్రపోయింది.నిద్రలో ఆ చంటిది నాన్నా-నాన్నా నన్ను వదిలి పెట్టి వెళితే నేను చచ్చి పోతాను.అని కలువరిస్తుంది.అదిచూసి సన్యాసి హృదయం కరుగుతుంది.కానీ మళ్ళీ మోహంలో పడిపోతానేమో నన్న భయపడి అక్కడి నుంచి పారిపోతాడు.గుట్ట మీద ఒకచోట సన్యాసి కూర్చుని వుంటాడు.వసంతి చినిగిపోయిన గుడ్డ కప్పుకొని నాన్నా-నాన్నా అంటూ, తనవైపు పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది.అది చూసి తాను తన కూతురు వసంతిని వదిలి సన్యాసం తీసుకొన్న దృశ్యం జ్ఞాపకం వస్తుంది.హృదయం కరిగిపోతుంది.చివరిగా సన్యాసి తన వేషాన్ని మార్చడం,భిక్షాపాత్రను పగలగొట్టడం,మళ్ళీ సంసారంలో ప్రవేశించి మామూలుగా మారిపోవడం వుంటుంది.ఆ తరువాత తన వసంతి కోసం వెతుకుతూ,కనపడ్డవారినల్లా అడుగుతూ వుంటాడు.చివరికి వసంతి శవం మాత్రమే దొరుకుతుంది.
                        ఈ కథలో సంగీతం-సాహిత్యం-హాస్యం, అన్నీ చాలా ఉన్నతమైన పద్దతిలో చేర్చబడి వున్నాయి.సెలవుల్లో,సత్యేంద్రుడి వెంట పశ్చిమ సముద్ర తీరాన,కార్ వార్ లో వున్నప్పుడు తాతయ్య ఈ నాటకాన్ని రాసాడు.
               తాతయ్య ఇంగ్లాండు నుంచి తిరిగి వచ్చిన తరువాత 1883 లో సంవత్సరంలో డిసెంబర్ 9 వ తేదీన శ్రీమతి మృణాళినీదేవితో వివాహం జరిగింది.పెళ్ళి అయినా తరువాత పదిహేను సంవత్సరాలు వైవాహిక జీవితాన్ని, తాతయ్య సుఖంగా అనుభవించాడు.కథలు, గేయాలు, నాటకాలు, వ్యాసాలు అనేకం రాసాడు.తాతయ్యకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు జన్మించారు.కాని తన వివాహం అయిన కొద్ది నెలలకే మాతృ సమానమైన,వదన గారు ( జ్యోతిరీంద్రుని భార్య), అకస్మాత్తుగా చనిపోవడం వల్ల,ఆయన ఆనందంలో విషాదం మిళితమైంది.మిగితాది రేపు.....