కనిపించడం లేదు: -గుముడాల చక్రవర్తి గౌడు

]అది
బంధాలను
అనుబంధాలను
ఒక్కటి చేస్తు
ఆత్మబంధువై
ఆలింగనం
చేసుకునేది
అప్పుడప్పుడు
ఆత్మీయ అతిథిగా వచ్చి
బోలెడన్ని కబుర్లు చెప్పేది
రెక్కలు లేకున్న
రెట్టింపు ఉత్సాహంతో
పోస్టుమ్యాన్ సంచిలోంచి
తుర్రున చేతుల్లో వాలిపోయేది
తోకలేనిపిట్ట ఇప్పుడు
తొంభై ఆమడలు 
కనిపించకుండా పోయింది
కనిపించడంలేదని
ఆందోళన చెందతున్న నా ఆత్మకు
ఆకాశవాణి వినిపించింది
క (కొ) ని పెంచేవారు కరువయ్యారని
అందుకే కనిపించకుండా పోయానని


(నేడు ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా)