మనమంతా--డా.గౌరవరాజు సతీష్ కుమార్.

పక్షులై మనమంతా 
పైపైకి ఎగురుదాం
చేపలై మనమంతా 
నీటిలో ఈదుదాం
కోతులై మనమంతా 
కొమ్మలెక్కి దూకుదాం
మబ్బులమై మనమంతా 
గాలిలో తిరుగుదాం
చుక్కలమై మనమంతా 
చంద్రునితో ఆడుదాం
పువ్వులమై మనమంతా 
దేవునిముందు వాలుదాం
పిల్లలమై మనమంతా 
కేలుమోడ్చి మొక్కుదాం !!