దసరా శుభాకాంక్షలు : జగదీశ్ యామిజాల

వెయ్యేళ్ళు 
భూలోకంలో కఠోర తపస్సు చేసిన 
మహిషాసురుడు
తనకు ఒక్క స్త్రీతో మాత్రమే
మరణం సంభవించాలని 
బ్రహ్మనుంచి పొందిన వరగర్వంతో
అహంకారంతో
దేవతలను హింసించాడు
 
మహిషాసురుడిని 
అంతమొందించడానికి
శివుడు తన నిర్ణయాన్ని 
శక్తిగా వెల్లడించాడు


విష్ణుమూర్తితోసహా దేవతలందరూ
తమ తమ ఆయుధాలనూ
ఆ శక్తిస్వరూపిణికి ప్రసాదించారు


దుర్గమ్మగా 
శక్తిస్వరూపిణి సింహవాహనంపై తరలివచ్చి
మహిషాసురుడితో తలపడింది
త్రిశూలంతో రక్కసుడిని వధించింది


జయజయదేవీ 
దుర్గాదేవీ అని దేవలోకం
దుర్గమ్మ విజయాన్ని కొనియాడింది


ఈ విజయాన్నే 
విజయదశమిగా జరుపుకుంటూ
దుష్ట శక్తుల ఆట కట్టించి
శిష్టుల రక్షణను కోరుతూ
సంబరాలు చేసుకునే 
ప్రతి ఒక్కరికీ 
దసరా శుభాకాంక్షలు