కష్టపుసతి: - డాక్టర్ . బి. వి. ఎన్ . స్వామి

‘నీకేంది మంచంలకు కంచం వస్తది’’ అందామె
‘‘అయితేంది’ అన్నాడతను
‘‘ఆలస్యం ఎందుకవుతుంది’’ ప్రశ్నించింది.
‘‘నువ్వు ముందువచ్చినవని అంటున్నవా’’ విసురుగా అన్నాడతను
‘‘నాకేంది మేస్త్రీతోటి తిట్లవడు’’ విసుగ్గా అందామె
పత్రిక చదువుతున్న నాకు వారి మాటలు వినిపించాయి. కూలి పనికి వచ్చిన ఆడ, మగ ఇద్దరి సంభాషణ అది. వంట పని చేసి మట్టి పనికి వచ్చిన ఆమె తన కన్నా ఆలస్యంగా వచ్చిన మగవాణ్ణి దెప్పిపొడిచింది. బడిలో బస్సులో ఒక దగ్గరనేమి అంతటా ఈ సమస్య తారసపడుతుంది. వంటపనినే ఇంటిపనిగా చూపి ఇంటాబయటా మేం పనిచేస్తున్నం అనే ఆధిక్యతను ప్రదర్శించే స్త్రీలు కనిపించారు. వారి మాటల్లో నిజం ఉంది నిష్ఠూరం ఉంది.
‘‘మిమ్మల్ని కూసుండబెట్టి మేపుడవుతుంది’’
‘‘మేపుడెందుకు. ఇష్టం లేక పోతే ఇడ్సిపెట్టు’’ నిర్లక్ష్యంగా అన్నడు.
‘‘కట్టుకున్నోన్ని ఇడ్సిపెట్టిందని తరువాత నువ్వే అంటవు’’ లోకనిందను యాది చేసింది.
ఎంత వద్దనుకున్నా ఆ మాటలు వినవచ్చి ఆలోచనలో పడేస్తున్నవి. బయటెకళ్ళే స్త్రీకి పనిభారం ఎక్కువ. కేవలం ఇంటిపని చేస్తే ఆర్థిక లేమి. ఆలోచిస్తున్న కొద్దీ దాక్కొని ఉన్న పక్షపాతమేదో బయటపడుతున్నది. ఈ సమస్య కూలి వాళ్ళేక కాదు. సమస్త స్త్రీ జాతిదని అర్థం అవుతున్నది. ‘‘కష్టపుసతి’’ అని బుంగి వ్యాఖ్యానించిన విషయం గుర్తుకొచ్చింది.
పుణ్యమంత గూడి పురుషుడై జన్మించె
పాపమంత గూడి పడతి యాయె
కష్టపు సతియని కాంచరెవ్వరు గూడ
విశ్వదాభిరామ వినురవేమ
వేమన శతకం
వేమన