వేదికొక్కటి దొరికితే చాలు పిల్ల కోయిల వసంత రాగాన్ని ఆలపించి వాసికెక్కుతుంది
అడుగులు వేయడం నిరంతరం సాధనచేస్తే
నిచ్చెన
ఎదురువస్తుంది
లక్ష్యoతమ పక్ష మవుతుంది జయం తిలకం దిద్దుతుంది
సాహసం దృఢ విశ్వాసం అనను కూలతను తనవైపుకు మలుచుకొని
విశ్వప్రజలను
మేల్కొల్పిన వివేకానంద వాణి
ప్రతీక్షణం పట్టుతప్పకుండా
అప్రమత్తమై ముందుకు వెడితేనే అందలమెక్కి ఊరేగేది
నిరూపించుకోవడానికి
నిరంతర పరిశ్రమ లో కరిగిపోతూ నిబంధన గీతను నిష్ఠతో దాటి పోటీలో గెలుపు
సమయావధిలో తప్పులను సవరించుకుంటూ మనసు అద్దం లో మెరిసే తెలుపు ప్రతిబింబం
క్షణం చాలు ఫలితాలు
తారు మారయి విజయాలు పూర్వ పక్షంలో నిల్వడానికి
బలహీనత ఒక్కటి
కాపెట్టుకొని కూర్చున్న గండు పిల్లిలా ఒక్క ఉదుటన దుంకి
ఉత్పపాతం కలిగించడానికి
లిప్తకాలం ఏమరపాటులో చేజారిపోయిన
ఒలింపిక్ స్వర్ణం
చరిత్ర నేర్పిన పాఠం
అవకాశం అటక మీద దాచిన మిఠాయి పొట్లం కాదు చేజిక్కించుకొని
ఉట్టి కొట్టి పొందే ప్రతి ఫలం