సాధన-- డాక్టర్ . బి. వి. ఎన్ . స్వామి

‘‘బుంగీ బొమ్మలేయడం ఎపడు నేర్చుకున్నావు’’
‘‘నాకు చిన్నప్పటి నుండి బొమ్మలంటే చాలా ఇష్టం రంగురంగుల బొమ్మలు కంటికి చల్ల దనాన్నిస్తయి. ఎపడు బొమ్మల పుస్తకాన్ని ఇష్టపడే వాణ్ణి. ఆ ఇష్టమే బొమ్మలు వేయడానికి దారితీసింది. ఎక్కువగా పెన్సిల్‌తో వేసేవాణ్ణి పెన్‌తో వేయాలంటే భయం అయ్యేది. పెన్సిల్‌తో వేసినపడు తపపోతే మలిపి వేసే అవకాశం ఉంటుంది. పెన్‌తో అది సాధ్యం కాదు. కనుక భయపడేవాణ్ణి.’’
‘‘ఇపడు డైరెక్ట్ పెన్ ఉపయోగిస్తూ బాగానే వేస్తున్నవు కదా’’
‘‘అందుకు ప్రేరణ ఒక సినిమా సన్నివేశం దాన్ని నేను ఇప్పటికీ మరచి పోలేక పోతున్నా’’
‘‘ఆ సన్నివేశాన్ని కళ్ళకు కట్టించు’’
ఒక పిల్లవాడు లోయలో పడ్డడు. లోయలోని వాళ్ళు పిల్లవాణ్ణి చిత్రహింసలు పెడుతున్నారు. వారి నుండి తప్పించుకోడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలుడయ్యాడు. విఫలమైన ప్రతిసారీ దెబ్బలు తింటున్నాడు. ఈ చిత్రహింసలతో చనిపోయే బదులు, లోయను ఎక్కుతూ ప్రాణాలు కోల్పవడం మంచిదనుకొని ఎలాంటి తాడు సహాయం లేకుండా కొండరాళ్ళు మెట్లుగా చేసుకొని అతి కష్టంగా ఎక్కి ప్రాణాలు దక్కించుకొంటడు. అతణ్ణి చూసి సంతోషం కలిగింది. ఈ సన్నివేశం స్ఫూర్తితో పెన్‌తో బొమ్మలు వేయడం మొదలు పెట్టిన. సాధన చేసిన తర్వాత ఏ బొమ్మనైనా అలవోకగా పెన్‌తో గీయగలుగు తున్నాను’’ అని ముగించిండు.
అనగననగ రాగ మతిశయిల్లుచు నుందు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ
వేమన శతకం
వేమన