హస్త కళాకారుడు --డా. కందేపి రాణిప్రసాద్

హస్తం అతడి నేస్తం
నైపుణ్యం అతడి సొంతం
కళ అతడి కిరీటం
సృజన అతడికేతనం


రైతుల వ్యవసాయానికి పనికొచ్చే
నాగలి ,కొడవలి,గొడ్డలి,గడ్డపార
చిరాలునేసేందుకు  పాయోగోపడే
సలేలమగ్గం,రాట్నం, కదురు
కుమ్మరిచక్రం,కల్లు గీసే కత్తి
సకల పనిముట్లకు అతడే ఆధారం!
సమస్త వృత్తులకు అతడే మూలం!


పసిడి కాంతుల కనకమైనా
పుత్తడిగా వెలిగే వెండైనా
ఇనుము,రాగికంచు,లోహాలేవైనా
కర్ర దూలమైనా,కఠిన పాషాణమైనా
అతడి చెయ్యి పడిందంటే చాలు 
తమతలలు పంచాల్సిందే!సాష్టాంగపడి నమస్కరించాల్సిందే!
వెన్న ముద్దలుగా మారి తీరాల్సిందే!
దేవలయాలమీది అద్భుతకళాసంపదైనా
రాజ ప్రసాదాల చక్కని చెక్కడలైనా
అతడి అపూర్వ ప్రతిభా పాటవమే!
అతని సృజనాత్మకతకు నిదర్శనమే!
మహాభారతంలో యమ సభామంట పమైనా
కృషిని కోసం నిర్మించిన ద్వార కానగరమైనా!
అతని అపార నిర్మాణ కౌశలమే!
అతని మేదోసంపత్తికి పరాకా స్టే!


మహిళల మెడలోని పవిత్ర మాంగళ్య మైనా 
మహారాజు దర్జాగా కూర్చునే సింహాసనమైనా
మనం భక్తితో మొక్కే దేవుని ప్రతిరూపమైనా
ఏదైనా అతని చేతి నైపుణ్య పుణ్యమే !
ఏమైనా అతని ఐదు వేళ్లు ఐదువృత్తులే
అతడే సజీవ శిల్ప కారుడు!
అతడే అతడే హస్త కళాకారుడు!
అతడే అతడే విశ్వ బ్రాహ్మణుడు!