ముక్కు దిబ్బడ పోవడానికి. --పి . కమలాకర్ రావు

 వాతావరణంలోని మార్పుల వల్ల గొంతు నొప్పి తో పాటు ముక్కు దిబ్బడ వస్తుంది. గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా మారుతుంది. కొద్దిగ దాల్చిన చెక్క పొడి మరియు సొంటి పొడి మిరియాల పొడి, తాజా తులసి ఆకులు ఇవన్నీ కలిపి నీటిలో వేసి మరిగించి చల్లార్చి తేనె కలిపి త్రాగాలి.  ముక్కు దిబ్బడ తగ్గిపోతుంది శ్వాస తేలికగా పీల్చుకో గలుగుతారు. దీనితో పాటుగా నీటిలో పసుపు వేసి మరిగించి  జాగ్రత్తగా ఆవిరి పట్టాలి. తల లోని భారం తగ్గిపోతుంది