త్రిపుల్ ఐ.టి. బాసర కు వరంగల్,కాశిబుగ్గ గుడిబడి నుండి ముగ్గురు విద్యార్థులు.: వరంగల్ అజయ్

 వరంగల్ కాశిబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నరేంద్రనగర్,గుడిబడి నుండి ముగ్గురు విద్యార్థులకు త్రిపుల్ ఐ.టి. బాసరలో అడ్మిషన్ లభించింది.గత సంవత్సరం 8మంది కి అడ్మిషన్ లభించింది. 2011-2012 నుండి ప్రతి యేటా ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులకు త్రిపుల్ ఐ.టి. బాసరలో అడ్మిషన్ లభించటం ఆనవాయితీగా కొనసాగుతున్నది.
 వాస్తవంగా ఈ సంవత్సరం 12 అడ్మిషన్లకు పక్కా ప్రణాళికను అమలు చేసినప్పటికినీ కరోనా సంక్షోభం వలన SSC పరీక్షలు నిర్వహించలేక పోవటం, ఫలితాల ప్రకటనలో వినూత్న ప్రయోగం,బాసర అడ్మిషన్ల ప్రక్రియలో నూతన విధానం అంఛనాలను తలక్రిందులు చేసింది.SSC ఫలితాల్లో  గత సంవత్సరం 10 GPA లు 4 సాధించటమైనది.  రాష్ట్ర స్థాయిలో 10 GPA ల సాధనలోనూ,త్రిపుల్ ఐ.టి. అడ్మిషన్ల సాధనలోనూ కాశిబుగ్గ నిరుపేద విద్యార్థులను ముందు వరుసలో నిలబెట్టడంలో గుడిబడి నిఖార్సైన పని సంస్కృతి, అంకితభావంతో పనిచేస్తుంది. 
విద్యను వ్యాపారం చేసే ప్రయివేట్ శక్తుల మోసపు మాటల వలలో పడకుండా ప్రభుత్వ బడులలో పేద విద్యార్థులు చేరాలి. సర్కార్ బడి చదువుల సత్తా చూపేందుకు నిరంతరం కఠోర పరిశ్రమ , నూతన ప్రయోగాలు,ప్రణాళికలు, పనితీరు లతో మున్ముందు కూడా లక్ష్యాల సాధనకు కట్టుబడి వుంటుంది మన గుడిబడి.