అద్దంలో ...అతివ ....: -----డా.కె .ఎల్వీ -హనంకొండ.

అద్దంతో 
నాకు పనిలేదు ..
నా ..జీవితంలో 
అద్దం చూసే 
క్షణాలు --
అతితక్కువ ..!


అందంగా లేనని 
అయినవాళ్లే ...
అంటుంటే -
అద్దంతో నాకేంపని 
అందులో ...
నేనిక చూసేదేముంది ,
చూసినా --
లాభమేముంది !


అందమై న -
వాళ్లకోసమే ...
అద్దం ..అట ..
అందంగా -
వున్నవాళ్లనే ...
అద్దం ..అందంగా 
చూపిస్తుందట !


అసలు ..
నా ..అందం గురించి 
నాకు కాక 
ఇంకెవరికి తెలుస్తుంది ?


నా ..అందం ..నేను 
అద్దంలో చూస్తేనే కదా 
నాకు తెలిసేది ...!


అద్దం చూస్తేనే కదా 
అనువుగా ..
అందాన్ని --
సరిదిద్దుకునేది ..!


నేను ...
అద్దాన్ని చూస్తేనేకదా ,
నన్ను అద్దం చూసేది !


అందుకే ..
నాఅందం సంగతి 
నేనూ -అద్దం ,
చూసుకుంటాం !


అద్దం చెప్పిన మాటకే 
శిరసువంచి 
అక్షరాల ...
ఆమోద ముద్ర వేస్తా !


అవసరమయిన 
మెరుగులతో ..
నా ..అందాన్ని ,
సరిదిద్దుకుంటా ..!!