ఔ మల్ల: -- బాలవర్ధిరాజు మల్లారం


గప్పట్ల ఊర్లల్ల 
ఎవుసం జేసెటోల్లు ఎక్కువుండెటోల్లు 
సదువుకునేటోళ్లు తక్కువుండెటోల్లు
పనిపాట ఎక్కువుండె 
తాగుడు,బుక్కుడు తక్కువుండె .
కుల గజ్జి ఎక్కువుండె 
మత పిచ్చి తక్కువుండె.
ఇమాన్ దారులు ఎక్కువుండె 
మోరుదోపులు తక్కువుండె 
సాయం జేసుడు ఎక్కువుండె 
మోసం జేసుడు తక్కువుండె 
మరి గిప్పుడు...
దీనికి ఉల్టా 
ఔ మల్ల!