చంపకమాల :
*పలుమరు సజ్జనుండు ప్రియ | భాషలె పల్కుఁగఠోరవాక్యముల్*
*బలుకఁడొకానొకప్పు డవి | పల్కిన గీడును కాదు నిక్కమే;*
*చలువకు వచ్చి మేఘఁడొక | జాడను దా వడగండ్ల రాల్చినన్*
*శిలలగునోటు వేగిరమె | శీతల నీరము గాక భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా
మేఘుడు చల్లని వర్షపు నీటి బిదువులనే కురిపించును. కానీ ఎండాకాలములో వడగండ్లు కురిపించినా, అవి నేలమీదకు వచ్చి చల్లని నీరుగానే అవుతాయి కానీ, రాళ్ళు కావు. అలాగే, మంచి వారు, సంఘ హితము కోరేవారు, పెద్దలు ఎల్లప్పుడూ సత్యముతో కూడిన మంచి మాటలనే మాట్లాడుతారు. ఏదైనా సందర్భంలో పరుష వాక్యాలు పలికినా అవి మనల్ని మంచి మార్గానికి తీసుకు వెళ్ళేవిగానే వుంటాయి గానీ, మనకు కీడు చేయవు.....అని భాస్కర శతకకారుని వాక్కు.
*పెద్దల మాట సద్ది మూట* అని కదా నానుడి.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss