నిజాయితీ--బహుమతి*చదువులబాబు, 9440703716

సమీర రాజ్యాన్ని సమీరవర్మ అనే రాజు పరిపాలించేవాడు.ఆయన ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని,వారి అవసరాలను తీరుస్తూ జనరంజకంగా పాలించేవాడు.అయినప్పటికీ క్షణికావేశంవల్ల దురాశవల్ల నేరాలు జరిగేవి., రాజు ఒకసారి అకస్మాత్తుగా ఒక కారాగారాన్ని సందర్శించారు.కారాగార నిర్వహణ అధికారిని కలిసి నిర్వహణ, తీరుతెన్నులను పర్యవేక్షిస్తున్నారు. అనంతరం నేరస్తులను చూడాలనిపించి వెళ్ళారు.
ఒక్కొక్క ఖైదీ దగ్గరకెళ్ళి "ఏ తప్పుకి నీకు
ఈ శిక్ష పడింది?"అంటూ అడగసాగాడు.
వాళ్ళు  రాజు క్షమాబిక్ష లభిస్తుందని
ఆశపడి,'మహారాజా!నేను ఏతప్పూ చేయలేదు నేను నిర్దోషిని.నేను ఎవరికీ కీడు
చేయలేదు,అనవసరంగా నన్ను ఇరి
కించారు 'అంటూ ఎవరికివారు తాము
చాలా మంచివాళ్ళమని చెప్పుకోసాగారు.
వారిలో ఒక నేరస్తుడు "మహారాజా! నేను నేరంచేశాను.అందుకేనాకుఈశిక్షవిధించారు.
నాకు ఈ శిక్షసరైనదే"అంటూ తన తప్పును
వివరించి చెబుతూ పశ్చాత్తాప పడ్డాడు.
అప్పుడు రాజు "ఇంతమంది మంచి వాళ్ళమధ్యన నేరస్తుడయిన ఇతడు
ఒక్కడూ వుండటం మంచిది కాదు.ఇతడిని
వెంటనే విడుదలచేసి బయటకు పంపండి."
అంటూ నిర్వహణాధికారికి చెప్పాడు.
తాను నేరస్తుడినని,తనకు శిక్ష సమంజసమేనని,నిజాయితీగా ఒప్పుకుంటూ, పశ్చాత్తాప పడినవాడిని
రాజు క్షమించి బయటకు పంపటమనే
బహుమతి ఇచ్చాడని గ్రహించి,మిగిలిన ఖైదీలు సిగ్గు పడ్డారు.
'తప్పు చేయటం మానవ సహజం.చేసిన
తప్పు గ్రహించి పశ్చాత్తాప పడినవాడే
మళ్ళీ తప్పు చేయడు.అదే ఆఖైదీ చేసిన
పని.అతని నిజాయితీకీ,పశ్చాత్తాపానికి
విముక్తి అనే బహుమతి లభించింది' అను
కున్నారు ఖైదీలు,అధికారి.
డి.కె.చదువులబాబు