సమరసతా నానీలు:-- సాకి,కరీంనగర్.9951172002

నాలోని నీవు నేనె
నీలోని
నీవు కూడా నేనను
'భావం సమరసం'


ఇంటిపేరు 
ఒక్కటయితే చాలు!
నా కులమని
సంబరమెందుకు?


కులవివక్షతలకి
విరుగుడు
విద్వేషమా?
సమన్వయమా?


అంబేద్కర్ 
అనుసరణీయుడే!
అనుచరుల
అడుగుజాడలే!?


మనువాదం లేదు
మనుషులమే
రాజ్యాంగమే
మనకు నేటి స్మృతి


కొంచెపుబుద్ధితోనే
కొట్లాటలు
సమరసభావముతో
సమైక్యత


కులపొత్తు
వివాహం వరకు!
కులాలపొత్తు
సమత్వం కొరకు!


అహం వీడితే
అందరు మనవారే
అయినా 'నేను'
విడువలేక పోతున్నం