మా ..డెంటిస్టు తాతయ్య ....: ------డా.కె .ఎల్వీ ,హనంకొండ.

పళ్లు తోముకోవడం 
అంటే ........
దంత దావనం అట ,
ఆంగ్లంలో దీనిని 
' టూత్ -బ్రషింగ్ '
అంటారట ....!


ఉదయం 
టూత్ బ్రషింగ్ కాగానే 
'టంగ్ -క్లీనర్ తో 
నాలుక -
గీసుకోవాలట ...!


అయిదు నిముషాలు 
సాఫ్ట్ బ్రష్ తో -
మెల్లగా ......
పళ్లు తోముకోవాలట ,
పళ్లు గట్టిగా -
తోముకోకూడదట !


పళ్ళుతోముకోగానే 
చూపుడు వేలితో ..
పళ్లు -చిగుళ్లు ...
గట్టిగా రుద్దాలట !


స్వీట్ తిన్నా -
చాకొలేట్ తిన్నా ,


పాలు తాగినా -
పళ్లరసాలు తాగినా ,


అన్నం తిన్నా --
చిరు తిళ్ళు తిన్నా ,


 నోరు బాగా.....
నీళ్లతో పుక్కిలించాలట !


ఆరునెలలకొకసారి 
దంతవైద్య పరీక్షలు 
చేయించుకోవాలట 
భయంలేకుండా 
వైద్యులను కలవాలట !


మాతాతయ్య 
డెంటిస్టుగా ....
నాకేమి ...భయం ...!!


-----------------------------------         


ఫొటోలో....
బేబీ.ఆన్షి.నల్లి.