అనురాగమయి....:--మొహమ్మద్ .అఫ్సర వలీషా -ద్వారపూడి (తూ గో జి)

చంద్ర బింబమంటి 
ఆ మోముకు
చిరునవ్వుల 
హారమే అలంకారం.....


చైతన్య పూరిత 
ఆ చలాకీ తనానికి
చమక్కున మెరిసే
మయూఖాల 
మెరుపులే ఆనందం....


చూపులలో
ఆత్మీయానురాగాల
చెలిమి సౌరభాలే 
బంధనం....


అనురాగమయి
అయిన అందాలరాశి
ప్రేమాను రాగమే 
మాకందరికీ  అపురూపం....!!