అహంకారి చేప (కథా గేయం): - చొప్ప వీరభద్రప్ప


కాలువ గట్టున నేను కదలి పోతుంటే
నిక్కి నిక్కి చూచింది నీళ్లులోని చేప


ఏమమ్మా చేప ఎగిరెగిరి చూస్తావు
గాలమేస్తే నీవు గతుక్కు మంటావంటి


నీయట్లా వారెందరో నింగిలో చుక్కలైనారు
గాలిలో నేను గజమెత్తు ఎగురుతా
నేలపై నీవు   నా ఎత్తు ఎగరమంది


దంబాలెన్నో దంచి పోశావు
దాగుకో నీళ్లల్లో దయ్యాలు వస్తాయంటి


చేతగాని వారికి చేష్టలు ఎన్నో
మాటకారితో నాకు మాటలేలంది


గొప్పను చూచే గౌరవం లేదు
గోటివంటి నీకు గొప్పలేలంటి


గద్దలుతిరిగే వేళ ఒద్దికగా వుంట మేలు
లేనిగొప్పకు పోతే అది  లేపుక పోతుందంటి


 మిడిచి పాటుతో  అది మించి ఎగిరింది
దర్పంతో అది దడి దాటి ఎగిరింది.


 గట్టున పడిచేప గిలగిల కొట్టింది
 రాహువువలె గద్ద రయమున వచ్చింది.


మంచి సుద్దులు మనసు నింపి
అహంకారం అణచిపెట్టిన
అడ్డులేని ఆనందం
అమరినిండు అంతమెరుగక