పేరుచెప్పు::- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

పేరుచెబుతావా నేస్తం - పేరుచెబుతావా?
అడిగినా దేవుడి - పేరుచెబుతావా?


పేరుచెబుతాను నేస్తం - నేను పేరుచెబుతాను!
నీవు అడిగినా దేవుడి - పేరు చెబుతాను!


ఎలకనెక్కే దేవుడెవరూ ?
ఎద్దునెక్కే దేవుడెవరూ?


ఎలకనెక్కేవాడు ఎంకయ్యా!
ఎద్దునెక్కేవాడు శివ్వయ్యా! ||పేరు||


దున్ననెక్కే దేవుడెవరూ?
గద్దనెక్కే దేవుడెవరూ?


దున్ననెక్కేవాడు యముడూ!
గద్దనెక్కేవాడు నారాయణుడూ! ||పేరు||


నెమలినెక్కే దేవుడెవరూ?
కాకినెక్కే దేవుడెవరూ?


నెమలినెక్కేవాడు సుబ్రహ్మణ్యుడూ!
కాకినెక్కేవాడు శనిదేవుడూ! ||పేరు||


హంసనెక్కేవారి పేరేమి?
సింహమెక్కేవారి పేరేమి?


హంసనెక్కేవారు సరస్వతీమాత!
సింహమెక్కేవారు పార్వతీమాత! ||పేరు||