అమ్మానాన్నలు:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


అనురాగపు తీగమల్లి అమ్మ
మమకారపు పాలవెల్లి నాన్న
మనకు తమరక్తం ధారపోసి
శరీరాన్ని ఇచ్చి పెంచి పోషించి
చేయిపట్టి దారిచూపిన
ప్రేమమూర్తులే కదా
మన అమ్మానాన్నలు
ఇలపై కనిపించే దైవాలు
మన తల్లిదండ్రులు !!