తాతా ..తాతా ..వస్తావా .:డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,హనంకొండ .

తాతా ..తాతా 
వస్తావా ...
బయటి కి పొదాం 
వస్తావా ...
హాయిగ తిరిగొద్దాం ,
వస్తావా .....!


గాలి -వర్షం 
వస్తుంది ...
చలిగాలిబాగా వీస్తుంది 
అనవద్దు .....
దగ్గు -జలుబు 
గుర్తుకు రావద్దు !               #తాతా..#


అమ్మ అడ్డు చెబితే ,
వినవద్దు ...
నాన్న భయానికి 
వెనకాడవద్దు ....!           #తాత....#


మాస్కు  మూతి కి ,
కట్టుకుందాం ...
శానిటైజర్ -
సంచిలో పెట్టుకుందాం ,
చేతితో ...
గొడుగు పట్టుకుందాం 
వెచ్చగ ...
స్వె ట్టర్ వేసుకుందాం 
నెత్తికి టోపీ పెట్టేద్దాం 
హాయిగా ...
బయట తిరిగొద్దాం !!             #తాతా #
---------------------------------
ఫోటో లో...
బేబీ...ఆన్షి.నల్లి.