పవిత్ర వృక్షం "మారేడు" -1. వివిధ ఉపయోగాలు..: పి . కమలాకర్ రావు

 సంస్కృతంలో దీన్ని బిల్వ వృక్షం గా పిలుస్తారు. అష్ట బిల్వాలలో  ఇది మొదటిది. మిగతావి, తులసి, వావిలి, ఉత్తరేణి, వెలగ, జమ్మి, ఉసిరి, గరిక. భారతీయ సాంప్రదాయంలో మారేడు వృక్షానికి ఒక పవిత్రమైన స్థానం ఉంది. ప్రతి గుడిలోనూ, ప్రముఖంగా శివాలయాలలో మారేడు చెట్టు మనకు దర్శనమిస్తుంది. బిల్వ పత్రాలతో శివుడికి అభిషేకాలు చేస్తారు. దీని చెట్టునీడన కూర్చున్నా మానసికమైన ఆందోళన తగ్గుతుందని ప్రతీతి. దీనిలోని రసాయనాలు కొద్ది చే
దు, జిగురు ను కలిగి ఉంటాయి.
 దీని కాయల పైన గట్టి టెంకు  ఉంటుంది.
 పండిన పండులోని గుజ్జు ను నీటిలో కలిపి కొద్దిగా వేడి చేసి చక్కెర వేసి త్రాగితే శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. వాతాన్ని, కఫాన్ని, హరిస్తుంది. మంచి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. మధుమేహం రాకుండా కాపాడుతుంది. రక్త మొలలకు ఇది మంచి ఔషధం.