198.అవనితల్లికి వందనం!తెలుగు భాషకు చందనం: బెలగాం భీమేశ్వరరావు,9989537835.

అవని తల్లిని, తెలుగు భాషను ఎంత కీర్తించినా
తనివి తీరదు.అవనితల్లి పేరుతో ఒక గేయం, తెలుగు పలుకు పేరుతో ఒక గేయం తయారు
చేశాను.అవనితల్లి భక్తి సమాచారం 2015 డిశంబరు సంచికలో వచ్చింది.//రంగు రంగుల
పూలు/రమ్యముగ పూయాలి/పచ్చ పచ్చని చేలు/పదిలముగ పండాలి//ఆకుపచ్చని చెట్లు/
అవనంత ఉండాలి/ప్రాణవాయువు మనకు/
కొరతలేకుండాలి//నీర నిధులై నదులు/సతతమూ
పారాలి/కలుషితం కాకుండ/మనమంత ఉంచాలి//కొండలూ గుట్టలూ/కొల్లలుగ ఉండాలి/
నల్లన్ని మబ్బులకు/కొలువుగా ఉండాలి//
జీవరాశులు అన్ని/సంతసముగుండాలి/స్వేచ్ఛగా
జీవించి/శోభనూ తేవాలి//ఎల్ల జీవులు ఉనికి/
ధరణిపై ఉండాలి/భూమాత ఒడిలోన/చల్లగా 
బతకాలి//కరుణ కలిగే మనిషి/మమతలను 
పంచాలి/అన్ని జీవుల పట్ల/ప్రేమతో మసలాలి//
అందాల భూమాత/అలరారుచుండాలి/ముందు
తరములకది/అండగా ఉండాలి//తెలుగు భాష
ఉన్నతిని పిల్లలకు చెప్పడానికి "తెలుగు పలుకు"
పేరుతో గేయం రాశానని చెప్పాను గదా.అది
//తెలుగు భాషను నిలుపు/ఓ తెలుగు తమ్ముడా/
తల్లి పలుకే మేలు/ఓ తెలుగు చెల్లెలా//ఉగ్గుపాలను త్రాగు/చిరువయసులో మీకు/ఊసు
లెన్నో చెబుతు/అమ్మ నేర్పెను తెలుగు//అమ్మ
నేర్పిన తెలుగు/మీకు ఇచ్చెను వాక్కు/భావ
ప్రకటన కేమొ/మీకు వచ్చెను హక్కు//అమ్మ మాటే
మీకు/ఆప్యాయతలు నేర్పె/అమ్మ పలుకే మీకు/
అనుబంధములు చూపె//'అందాల తెలుగు' గా/
అవనిలో పేరుంది/లిపి కూడ మిన్నదని/ పెను పేరు వచ్చింది//అమ్మ మాటల్లోనె/అభ్యసించుట
మిన్న/హాయిగా నేర్చుటకు/దారి చూపును కన్న//
శ్రావ్య రాగాలెన్నొ/పలికారు పదకవులు/కావ్య
రాజములెన్నో/అల్లారు మన కవులు//తల్లి భాషే
మీకు/తరగనీ నిధియండి/పెద్దలిచ్చిన నిధిని/
జారనీబోకండి//మీ తల్లి పలుకేమొ/కడలి దాటుతు వెళ్ళె/ఖండాంతరాలలో/ఖ్యాతి చెందగ
వెలిగె/తెలుగు భాషను నిలుప/నోరార పలుకండి/
మన భాష ఉన్నతిని/రక్షించ రారండి//ఈ గేయం
కూడా 2015 డిశంబరు లో వచ్చింది. పత్రిక
'ధర్మశాస్త్రం'!(సశేషం)