పవిత్ర వృక్షం " మారేడు "-2, వివిధ ఉపయోగాలు...: - పి . కమలాకర్ రావు


 మధుమేహ వ్యాధి తగ్గడానికి, మారేడు ఆకులను శుభ్రంగా కడిగి దంచి రసం తీసి పరిగడుపున రెండు స్పూన్లరసం  త్రాగాలి. రక్తంలోని చక్కెర తగ్గుముఖం పడుతుంది. మారేడు ఆకుల రసంలో కొద్దిగా మిరియాల పొడి వేసి త్రాగితే పచ్చ కామెర్ల వ్యాధి కూడా తగ్గుతుంది. మారేడు ఆకుల రసం రక్తపోటును కూడా తగ్గిస్తుంది. మారేడు కాయ గుజ్జు ను నువ్వుల నూనెలో వేసి వేడి చేసి వడగట్టి చల్లార్చి వినికిడి శక్తి తగ్గినప్పుడు చెవిలో చుక్కలు వేసుకోవాలి. మారేడు కాయ గుజ్జు మజ్జిగలో కలిపి త్రాగితే అరిశ మొలల వ్యాధి తగ్గుతుంది. తీవ్రమైన తలనొప్పి వచ్చినప్పుడు మారేడు ఆకుల రసాన్ని నొసలు పై పూసుకోవాలి. వెంటనే తల నొప్పి తగ్గిపోతుంది. నువ్వుల నూనెలో మారేడు పండు గుజ్జు వేసి వేడి చేసి కొద్దిగా కర్పూరం కలిపి  కొన్ని గంటల తర్వాతతలకు పట్టిస్తే తల లోని పేలు రాలిపోతాయి. నేత్రవ్యాధులు తగ్గడానికి మారేడు ఆకులను ముద్దగా చేసి అందులో కొద్దిగా నెయ్యి వేసి బాగా కలిపి న  ముద్దను కళ్లపై పెట్టుకుంటే కంట్లో మంటలు తగ్గిపోతాయి.