220.భూదేవి హెచ్చరిక:: -బెలగాం భీమేశ్వరరావు-9989537835.


 


మనముండే భూమే మనకన్నీ ఇస్తుంది. ఆ భూమిని మనం పాడుచేసుకుంటే మన పరిస్థితి

ఏమిటి?అప్పుడు మన బతుకు భారమవుతుంది.

కష్టాలు, నష్టాలు మనను వెంటాడతాయి. ఎందుకిలా మనకు జరుగుతుందో ఆ భూమే 

మనకు విడమరిచి చెప్పినట్లు 'ఆదిదేవత'గేయం

తయారు చేశాను.//అగ్ని గోళం గాను/ఆవిర్భవించాను/కాలగమనంలోను/ నేలగా మారాను//గాలికీ నీటికీ/ నెలవుగా నయ్యాను//

కూటికీ గూటికీ/కొలువుగా మారాను//తరువులు,జీవులు/నా ఒడిన పుట్టాయి/హాయిగా

పెరుగుతూ/ఆనంద పరిచాయి//అంతలో మానవులు/అవతరించారు/బుద్ధి జీవులు గాను/

వృద్ధి చెందారు//ప్రకృతిని దేవతగ/పూజలే చేశారు/ఆది దేవత అనుచు/గౌరవం చూపారు//

భువిని దివిగ మార్చ/యత్నమే చేశారు//పదును

బుద్ధికి పెట్టి/సౌఖ్యమే పొందారు//నరుల ప్రగతిని

చూసి/ముచ్ఛటే పడ్డాను/ఆనంద డోలికల/హాయినే పొందాను//కలకాలమా హాయి/ఉండుననుకున్నాను/నా జన్మ సార్ధకత/చెందుననుకున్నాను//చదవేస్తె ఉన్న మతి/పోవు

సామెత లాగ/నాగరిక నరులేమొ/నరకమును

చూపారు//ప్రకృతి ప్రాధాన్యతను/పూర్తిగా మరిచారు/సమతుల్య ప్రకృతికి/పలు తూట్లు

పొడిచారు//మంచి చెడులను వారు/ఎంచుటను

మానారు/లాలించు తల్లినే/కాలితో తన్నారు//

అడవులను నరికారు/నదులనే చెరిచారు/తోటి

ప్రాణుల బతుకు/ తృణముగా తలచారు//విష

తుల్య ఎరువులను/మితిమీరి వాడారు/నేలలో

సారమును నిస్సారపరచారు//పాల కోసం పాల/ పొదుగునే కోస్తారా/వృద్ధి పేరుతొ నేల/నంతమే

చేస్తారా//బుద్ధి మారకపోతె/భూమి చవిటిది అగును/భూమి చవిటిది అయితె/బువ్వ కరువే

అగును//ఈ గేయం 2018 ఆగస్టు 5 ప్రజాశక్తి

లో వచ్చింది.(సశేషం)