222.మహారాష్ట్ర ప్రభుత్వ తెలుగు వాచకాలలోనా రచనలు:: -బెలగాం భీమేశ్వరరావు,9989537835.

 2016 నుంచి 2019 వరకు నా రచనలు ఏడు
వరకు 2,6,7,8,10,11తరగతులకు తెలుగు వాచక
పాఠ్యాంశాలుగా మహారాష్ట్ర స్టేట్ బ్యూరో ఆఫ్ 
టెక్స్ట్ బుక్స్ ప్రొడక్షన్ అండ్ కరికులం రీసెర్చ్ వారు
తీసుకున్నారు.ఏడు పాఠ్యాంశ రచనలలో మొదటిది 2016లో మొదటి ముద్రణ జరిగిన
6వ తరగతి తెలుగు వాచకం సరళభారతి లో
' భారతీయత ' అనే గేయం! వాచకంలో మొదటి పాఠ్యాంశంగా ప్రచురించారు. ఈ గేయం 2003 జూన్ 1 వార్త ఆదివారం అనుబంధంలో వచ్చింది.పనసపళ్ళు బాలగేయ సంపుటిలో ఉంది.//జనగణమనయనిపాడండీ/ జాతి గౌరవము నిలుపండీ//సుజలాం
సుఫలాం పలుకండీ/పాడి పంటలను పెంచండీ//
సారే జహాసే పాడండీ/సహనశీలురుగా మారండీ//
గాంధీ బోధలు చదవండీ/శాంతి మార్గమున
నడవండీ//జెండా ఊంఛా పాడండీ/జెండాకండగ
ఉండండీ//వివిధ భాషలు నేర్వండీ/భారతీయతను చాటండీ//....రెండవ పాఠ్యాంశ
రచన 7వ తరగతి తెలుగు వాచకం"సరళ భారతి"
లో వచ్చింది.ఈ వాచకం ప్రథమ ముద్రణ 2017లో
జరిగింది.ఇందులో "ప్రకృతి ధర్మం" అనే కథను వచన పాఠ్యాంశంగా తీసుకున్నారు.ఈ కథ 2013 జూలై నెల బాలభారతం లో వచ్చింది.మూడవ
పాఠ్యాంశ రచన 8వ తరగతి తెలుగు వాచకం
"బాలభారతి"లో వచ్చింది. ఈ వాచకం ప్రథమ
ముద్రణ 2018లో జరిగింది. నా యజ్ఞఫలం నవల
లోని ఒక శీర్షిక ను సంభాషణ రూపంలో 
"ప్రకృతి వ్యవసాయం" పేరుతో పాఠ్యాంశం వచ్చింది. నాలుగో పాఠ్యాంశ రచన 10వ తరగతి
తెలుగు వాచకం 'కుమార భారతి'లో వచ్చింది. ఈ
వాచకం ప్రథమ ముద్రణ 2018 లో జరిగింది.2016 ఆగస్టు బాలబాట మాసపత్రిక లో వచ్చిన "కసురుకాయలు"పిల్లల నాటికను వాచక పాఠ్యాంశంగా తీసుకున్నారు. ఈ నాటికను మధ్యలో బడి మానివేయు వారిపై రాశాను.
నా బాలగేయ సంపుటి"మా మంచి నాన్న'"కు
అనుబంధం గా ఉన్న  నాటికల నుంచి "కసురుకాయలు"నాటికను గ్రహించారు.5వ,6వ
పాఠ్యాంశ రచనలు 2వ తరగతి తెలుగు వాచకం
'బాలభారతి' లో వచ్చాయి. అందులో మొదటిది
'ఎవరు నేర్పారు?'!ఈ బాలగేయం'పాఠాలు' పేరుతో 2002 ఏప్రిల్ 21 వార్త ఆదివారం లో 
వచ్చింది.//చెట్టూనున్నా రామచిలుక/ మాట నేర్పిందీ//కూ...అంటూ కోయిలమ్మా/పాట నేర్పిందీ//గంతులేసే కోతీ నాకు/ఆట నేర్పిందీ//
నీటిలోని చేపా నాకు/ఈత నేర్పిందీ//చెరువు
గట్టున చెవులా పిల్లి/పరుగు నేర్పిందీ//బడిలోని
టీచరమ్మా/పాఠం నేర్పిందీ//2వ తరగతి వాచకం
లోనే మరోగేయం 'షికారు'! ఈ గేయం షికారు
పేరుతోనే 2003 జూన్ 22వ తేదీన వార్త ఆదివారం అనుబంధం లో వచ్చింది.//అమ్మా నాన్నా అక్కా నేనూ/షికారు కెళ్ళామూ//సముద్ర
పొడ్డున నడుస్తు మేమూ/సరదా పడ్డాము//
జొన్నా పొత్తులు ఐస్ క్రీములూ/అక్కడ తిన్నాము//హోరున వీచే గాలికి మేమూ/సంబర
పడ్డాము//సముద్ర గవ్వలు నత్తగుల్లలూ ఎన్నో
ఏరాము//కెరటాల్ రయ్యిన ఎగిరితె మేమూ/
బెంబేలెత్తాము//అమ్మా నాన్నల అక్కున చేరీ ధైర్యం పొందాము//ఈ  గేయాలు కలిగిన రెండవ
తరగతి తెలుగు వాచకం ప్రథమ ముద్రణ 2019
లో జరిగింది. ఏడవ పాఠ్యాంశం 11వ తరగతి
తెలుగు వాచకం ' యువభారతి ' లో వచ్చింది.
ఈ వాచకం ప్రథమ ముద్రణ 2019 లో జరిగింది.
పాఠ్యాంశం పేరు 'అభిరుచులు - ఆత్మ బంధువులు'!వ్యాస రూపంలో పాఠ్యాంశం వచ్చింది. ఇవి వాచకాలలో వచ్చిన నా పాఠ్యాంశ
అనుభవాలు.వాచకాలలో ఉన్న విషయసూచికలలో  పెద్ద రచయితల పేర్ల మధ్య
నా పేరు బాధ్యతతో రచనలు చేయమని హెచ్చరిక
చేస్తున్నట్టే కనిపించేది.(సశేషం)