224.ప్రకృతి ఋణం ఎలా తీర్చాలి: బెలగాం భీమేశ్వరరావు9989537835


 ప్రకృతి వల్ల మనమెన్నో ప్రయోజనాలు పొందుతున్నాం.తిరిగి మనం ప్రకృతికి ఏం

చేస్తున్నాం? ఏం చేయాలో ఒక తల్లి తన బిడ్డకు

ఇచ్చిన సందేశమే"ప్రత్యుపకారం"గేయకథ!

//పొద్దు పొడిచే వేళ/అమ్మ నను లేపింది/ఉదయాన నడచుటకు/తోటకెళ్ళాలంది//కళ్ళు

పులుముతు నేను/తోట చేరితినండి/పూలన్ని విచ్చి నను/స్వాగతించాయండి//మల్లెలూ తలలూపి/తావి జిమ్మాయండి/మది నిండ హాయిని/నింపి వేశాయండి//నంది వర్ధన పూలు/

తారలుగ మెరిశాయి/నింగిలో తారలకు/వీడ్కోలు

పలికాయి//ముద్ద మందారాలు/మిరుమిట్లు

గొల్పాయి/బాలభానునితోను/పోటీకి నిలిచాయి//

ఝుమ్మంటు తుమ్మెదలు/వచ్చాయి గుంపుగా/

వినిపించె నాదాలు/వీనులకు ఇంపుగా//తూనీగ

లెగురుతూ/కనువిందు చేశాయి/పట్టుటకు దొరకక/పరుగు పెట్టించాయి//జామచెట్టు మీద/

చిలుకలు వాలాయి/దోరపండ్లను కొరికి/నా ముందు రాల్చాయి//అవి తీసి నేనేమో/ఇంటికీ

చేరాను/తోటలో చూసినవి/అమ్మతో చెప్పాను//

"తోట ఇచ్చినవన్ని/హాయిగా పొందావు/మరి,నీవు

తోటకు/తిరిగేమి ఇచ్చావు?"//అని అమ్మ నన్నడిగి/చిరునవ్వు నవ్వింది/ప్రేమతో దరి చేరి/

తలపైన నిమిరింది//ఆ రీతిలో అమ్మ/నన్నడుగ

గానే/బదులుగా నేనంత/ఈ రీతి చెప్పాను//

"నీళ్ల కుండీ నుంచి/నీరు తోడీ నేను/పాదు పాదుకు పోసి/వచ్చాను నిజమమ్మ!"//నేను చేసిన

పనికి /అమ్మ ఆనందించె/వేడి పాలను తెచ్చి/

నా చేతికందించె//"ప్రకృతిచ్చినవన్ని/హాయిగా 

పొందాలి/ప్రకృతిని రక్షించి/ఆ ఋణం తీర్చాలి"//

అని అమ్మ నాతోను/మరి మరీ చెప్పింది/అమ్మ

మాటను నేను/అమలు చేయుదునండి// ఈ 

గేయం 2018 అక్టోబరు ధ్యానమాలిక పత్రికలో

వచ్చింది.(సశేషం)