సూర్యవంశం.డా.బెల్లంకొండనాగేశ్వరరావు-చెన్నయ్ .

సూర్యుడు,వైవస్వతుడు,మనువు,ఇక్ష్వాకుడు,కుక్షి,వికుక్షి,పురంజయుడు, యోవనాశ్వుడు,మాంధాత,పురుకుత్సుడు,త్రనదస్యుడు,అరణ్యుడు,త్రిశంకుడు, హరిశ్చంద్రుడు,బాహుకుడు,అసమంజసుడు,అంశుమంతుడు,దిలీపుడు, భాగీరధుడు,నాభాగుడు,అంబరీషుడు,సింధుద్వీపుడు,నయుతాయువు, ఋతుపర్ణుడు,సర్వకాముడు,సుదాముడు,కల్మషపాదుడు,అశ్మకుడు, మూలకుడు,ఖట్వాంగదిలీపుడు,రఘునృపాలుడు,అజమహారాజు,దశరధమహారాజు,శ్రీరాముడు,లక్ష్మణుడు,భరతుడు,శత్రుఘ్నుడు,ఇలాసాగినసూర్యవంశంలో....... శ్రీరాముని సంతతి కుశ-లవుడు. తనఆదేశం మేరకు లక్ష్మణుడుఅవతారపరిసమాప్తి అయోధ్యా నగరం లోని సరయూనది లో కావించడంతో,లవునికి 'శ్రవస్తి' కుశునకు 'కుశపురం' లక్ష్మణ సంతతి అంగదునికి'అంగదీయరాజ్యం'చంద్రకేతునకు'చంద్రకేతు రాజ్యం'భరతునిసంతతితక్షకునకు'తక్షశిల'పుష్కళునకు'పుష్కలావతి'రాజ్యాలు, శత్రుఘ్నడి సంతతి సుబాహు కు'మధుర'శత్రుఘతికి'విదీష' రాజ్యాలను నిర్మించి అప్పగించిన శ్రీరాముడుభరత,శత్రుఘ్నలసమేతంగాఅగ్నినిచేతపట్టి,అయోధ్యవదలి ఉత్తరదిశగాప్రవహిస్తున్న'సరయు'(సర్జు.నాటినదిపేరు)నదిలోఅవతారసమాప్తి కావించారు.
దశరధుని మనుమ సంతతి చక్కగా రాజ్యపాలన చేయసాగారు.ఒకరోజు అయోధ్య నగర దేవత కుశునకు కలలో కనిపించి ,'నీపూర్వికులు పాలించిన అయోధ్యను జనరంజకంగా పాలనచేయి'అనికోరడంతో,కుశావతి పట్టణాన్ని బ్రాహ్మణులకు ధారబోసి,అయోధ్యపాలించసాగాడు.ఒకరోజు కుశుడు పరివారసమేతంగావచ్చి, సరయూనదిలో జలక్రీడలు ఆడుతుండగా కుశుని చేతినుండి 'చైత్రాభరణం'జారి నీటిలో పడిపోయింది.అది అగస్త్యమహర్షి నుండి తన తండ్రి స్వికరించి తనకు ఇచ్చినదివ్య ఆభరణం  దానికొరకు ఎంతవెదికించినా ప్రయోజనం లేకపోవడంతో కోపగించిన కుశుడు తన ధనస్సులో గరుడాస్త్రాన్ని సంధించి నదికి ఎక్కుపెట్టాడు. 
'రక్షించండి మహావీరా' ఇదిగో మీఆభరం ,నేను కుముదుడు అనే నాగరాజును పాతాశలోక నివాసిని ఈమెనాచెల్లెలు'కుముద్వవతి'తమరు ఈమెను వివాహం చేసుకోవాలని నామనవి' అని చేతులు జోడించాడు.వారి వివాహనంతరం కొంతకాలానికి వారికి 'అతిథి'అనేకుమారుడుజన్మించాడు.అన్నివిద్యలునేర్చిన అతిథికి నిషద రాజకుమార్తెతో వివాహంజరిపించారు.వీరికి'నిషాదుడు'జన్మించాడు.
'దుర్జయుడు' అనేరాక్షసుడు ఇంద్రునితో యుధ్ధనికిరాగా ఇంద్రుడు కుశుని సహాయంకోరాడు .తమవంశఆచారప్రకారం శరణాగతులను రక్షించడం ఆచారంకనుక కుశుడు దుర్జయుని తో పోరాడుతూ అతన్ని సంహారించి  తనూ ప్రాణాలు కోల్పోయాడు.అతని భార్య కుముద్వతి నాటి ఆచారప్రకారం సతీసహగమనంచేసింది.నిషాదునికి'నలినాక్షుడు' అతనికి'నభుడు' అతనికి 'పుండరీకుడు'అతనికి'క్షామధన్వుడు'అతనికి'దేహనీకుడు'అతనికి'అహీనగుడు' అతనికి'పారియాత్రుడు' అతనికి 'శీలుడు'అతనికి'ఉన్నభుడు'అతనికి'వజ్రనాభుడు' అతనికి'శంఖణుడు'అతనికి'వ్యుషితాశ్వుడు'అతనికి'విశ్వసహుడు'అతనికి 'హిరణ్యనాభుడు'అతనికి'కౌసల్యుడు'అతనికిబ్రహ్మిష్ఠుడు'అతనికి'పుత్రుడు'అతనికి'పుష్యుడు' అతనికి'ధ్రువసంధి'అతనికి'సుదర్మనుడు'అతనికి'అగ్నివర్ణుడు.
వ్యాధిగ్రస్తుడు అయిన అగ్నివర్ణుడు మరణించేనాటికి అతనిభార్య గర్బవతి, ఆమె రాజ్యపాలన స్వికరించింది.మంత్రులు,రాజోద్యోగుల అండదండలతో రాజ్యపాలన కొనసాగించింది.