ఉపాధ్యాయపర్వము-40:--రామ్మోహన్ రావు తుమ్మూరి


 కొంచెం బడి విషయాన్ని పక్కన పెడితే మరో విషయం గురించి చెప్పాలి.

నేను ప్రధానోపాధ్యాయునిగా ఛార్జ్ తీసుకోగానే తెలిసిన మరో విషయం అదిసి పే బిల్ సెంటర్(P.B.C) అని.

గర్ల్స్ స్కూల్లో పనిచేసినప్పుడు మిగతా విషయాలు తెలిసాయి కాని పేబిల్ సంగతి తెలియదు.ఆ ఒక్కటి H.M.గారే చూసుకునే వారు. నాకు జీతాల బిల్లు చేయటం పూర్తిగా కొత్త.దానికి తోడు ఏదో  మా బడిలో టీచర్ల జీతాలే అంటే నలుగురిది చేస్తే చాలు.కాని ఏడెనిమిది స్కూళ్ల టీచర్ల జీతాలు బిల్లు చేయాలి.

పేబిల్ ఓ పెద్దపని.కటింగుల ఓచర్లు ,పే బల్ రిజిస్టర్ లో ఎంట్రీ,అందులో ఇన్క్రిమెంట్లు ఇదంతా ఒక ఎత్తు.అంతా తయారు చేసుకుని మండలాఫీసులో సబ్మిట్ చేయాలి.బిల్ 

అప్రూవ్ చేయించుకోవాలి.ఇదంతా చేసిన తరువాత ఫస్ట్ తారీఖు రాగానే

మండలాఫీసుకు వెళ్లి చెక్కులు తీసుకుని

బ్యాంకుకు వెళ్లి ఎమౌంట్ డ్రా చెయ్యాలి.

ఆరోజు బ్యాంకులో అభిమన్యుడి పద్మవ్యూహ ప్రవేశం లాంటిదే.భద్రంగా ఆ డబ్బు మళ్లీ స్కూలుకు తీసుకు వెళ్లి అందరికీ పంచాలి న్యాయంగా ఐతే.కాని

కాగజ్ నగర్ మండల్ లో అప్పట్లో నాలుగైదు పిబిసిలుండేవి. ఆ పిబిసి H.M.లందరూ సాయంత్రం ఇళ్ల దగ్గరే 

జీతాలు బట్వాడా చేసేవారు.

   ఇక నా సంగతికి వస్తే నాకిదంతా కొత్త.

నాకంటే ముందున్న హెడ్ మాస్టర్ విజయరావుసారు పేబిల్ చేయడంలో ఎక్సపర్ట్.ఆయన ఉండేది మా కాలొనీ పోస్టాఫీసు క్వార్టర్లో.ఎందుకంటే వాళ్లావిడ మా కాలనీ పోస్ట్ మాస్టర్ గనుక.విజయరావు సారు నాకు అంతకు ముందు కొంచం పరిచయమే కాని,నాకు ఛార్జి అప్పజెప్పి ,నాకు బిల్లుల్లా చేయాలో నాలుగైదు రోజుల పాటు బాగా ఎక్స్ప్లెయిన్ చెయ్యటం,

దానికి తోడు మమ్మల్నింకా దగ్గరికి చేసే ధూ.పా.ప్రియత్వం మమ్మల్ని మంచి మిత్రులుగా చేసాయి.చాలా సరదాగాకబుర్లు చెప్పుకుంటూ ఆ తరువాత అనేక సార్లు కలుపుతున్నాం. ఇప్పటికీ కలిసినప్పుడు కబుర్లు కలబోసుకుంటూంటాం.అలా విజయ రావుసారు నాకు పేబిల్ గురువు.అది మొదలు మిగతా సర్వీసంతా పే బిల్లులు చేయడమే గనుక గట్టి పునాది వేసి తరువాత పే బిల్లు ఎలా చేయాలో నేను చాలా మందికి నేర్పేంతగా తెలియ వచ్చింది.

        అయితే బడిలో ఉన్నప్పుడు ఈ పని చేస్తే బడి పనికి ఆటంకమని ,ఇంట్లోనే ఆఫీసు ఏర్పాటు చేసుకున్నాను.ఆ వర్కంతా హోమ్ వర్కే.జీతాలు కూడా ఇంట్లోనే ఈయటం జరిగేది.ఇందులో ఇంకో ముఖ్య వ్యక్తి గురించి కూడా చెప్పాలి.ఆయన ప్రసాద్.మండల్ ఆఫీసులో క్లర్కు.ఆయన వల్ల కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను.ప్రతి నెలా ఆయనకే సబ్మిట్ చెయ్యాలి గనుక

అవకతవకలుంటే ఆయన ఎలా సరిచేయాలో చెప్పే వారు.తోటి పి.బి.సి హెడ్మాస్టర్లతో దోస్తానా,మండల్ డెవలెప్మెంట్ ఆఫీసర్ గారితో సమన్వయం అదంతా తలచుకుంటే భలే రోజులు అనిపిస్తుంది.(సశేషం)